శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 14, 2020 , 17:50:06

బలపరీక్ష నిర్వహించండి.. గవర్నర్‌ను కోరిన బీజేపీ నేతలు

బలపరీక్ష నిర్వహించండి.. గవర్నర్‌ను కోరిన బీజేపీ నేతలు

భోపాల్‌: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మధ్యప్రదేశ్‌ రాష్ట్ర నాయకులు గవర్నర్‌ లాల్జీ టాండన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్‌కు వినతిపత్రం అందించారు. అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలనీ.. అదే సమయంలో వీడియో కూడా తీయాలని వారు గవర్నర్‌ను కోరారు. గవర్నర్‌ లాల్జీ టాండన్‌ను కలిసిన వారిలో మాజీ ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌ సింగ్‌ చౌహాన్‌, గోపాల్‌ భార్గవ, నరోత్తమ్‌ మిశ్రా, భూపేంద్ర సింగ్‌ ఉన్నారు. 

ఇటీవల కాంగ్రెస్‌ సీనియర్‌ లీడర్‌ జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఆరుగురు మంత్రులు సహా 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. దీంతో కమల్‌నాథ్‌ ప్రభుత్వం మైనార్టీలో పడింది. 


logo