బుధవారం 20 జనవరి 2021
National - Dec 28, 2020 , 11:50:18

కండోమ్స్‌కు ఫుల్ గిరాకీ.. హైద‌రాబాదే టాప్‌!

కండోమ్స్‌కు ఫుల్ గిరాకీ.. హైద‌రాబాదే టాప్‌!

న్యూఢిల్లీ: 2020 ఏడాది ఏంటోగానీ మ‌న జీవితాల‌ను పూర్తిగా మార్చేసింది. అప్ప‌ట్లో కొత్త ఏడాది వ‌స్తూ వ‌స్తూ త‌న వెంట క‌రోనా మ‌హ‌మ్మారిని తీసుకొచ్చి ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌నుషుల జీవన శైలిని, అల‌వాట్ల‌ను మార్చింది. లాక్‌డౌన్లు, మాస్క్‌లు, శానిటైజ‌ర్లు అంటూ గ‌తంలో ఎప్పుడూ విన‌ని, చూడ‌ని వింత‌ల‌ను చూపించింది. అంతేకాదు తాజాగా ఓ అధ్య‌య‌నం ప్ర‌కారం ఇండియాలో కండోమ్స్ అమ్మ‌కాలు కూడా భారీగా పెరిగిపోయాయ‌ని తేలింది. అందులోనూ రాత్రి పూట కంటే ప‌గ‌లే ఎక్కువ‌గా వీటి ఆర్డ‌ర్లు వ‌చ్చిన‌ట్లు ఈ అధ్య‌య‌నం చేసిన స‌ర్వీస్ యాప్ డుంజో తెలిపింది. 2020లో భార‌త వినియోగ‌దారుల కొనుగోలు తీరు ఎలా మారిపోయిందో ఈ అధ్య‌య‌నం వివ‌రించింది. 

లాక్‌డౌన్ ఎఫెక్ట్‌

ఈ ఫ‌లితాలు లాక్‌డౌన్ ప్ర‌భావాన్ని క‌ళ్ల‌కు క‌డుతున్నాయి. క‌రోనా వ్యాప్తిని క‌ట్ట‌డి చేసేందుకు దేశవ్యాప్తంగా క‌ఠినంగా లాక్‌డౌన్ అమ‌లు చేసిన సంగ‌తి తెలుసు క‌దా. ఈ స‌మయంలో కండోమ్స్ కోసం రాత్రి పూట కంటే ప‌గ‌లే మూడు రెట్లు ఎక్కువ ఆర్డ‌ర్లు వ‌చ్చిన‌ట్లు డుంజో వెల్ల‌డించింది. ఇందులో మ‌న హైద‌రాబాదే టాప్‌లో ఉండ‌టం మ‌రో విశేషం. కండోమ్స్ ఆర్డ‌ర్లు భాగ్య‌న‌గ‌రంలో ఆరు రెట్లు ఎక్కువ‌గా ఉన్నాయ‌ట‌. చెన్నైలో 5 రెట్లు, జైపూర్‌లో 4 రెట్లు, ముంబై, బెంగ‌ళూరుల్లో రెండు రెట్లు కండోమ్స్ కోసం ఆర్డ‌ర్లు చేసిన‌ట్లు డుంజో చెబుతోంది. 

ఐపిల్‌, ప్రెగ్నెన్సీ కిట్స్‌కూ అదే డిమాండ్‌

కండోమ్సే కాదు గ‌ర్భాన్ని నివారించే కాంట్ర‌సెప్టివ్ ఐపిల్స్, ప్రెగ్నెన్సీ కిట్స్‌‌కూ అదే స్థాయిలో డిమాండ్ ఉండ‌టం విశేషం. హైద‌రాబాద్ స‌హా బెంగ‌ళూరు, పుణె, గురుగ్రామ్‌, ఢిల్లీల‌లో ఐపిల్స్‌కు విప‌రీత‌మైన డిమాండ్ ఏర్పడిన‌ట్లు ఆ స్ట‌డీ తేల్చింది. ఇక జైపూర్ అయితే అత్య‌ధిక ప్రెగ్నెన్సీ కిట్స్ ఆర్డ‌ర్ చేసిన‌ట్లు తేలింది. 

ఆహారంలోనూ మారిన అల‌వాట్లు

హైద‌రాబాదీలు త‌మ ఆహార అల‌వాట్ల‌ను కూడా మార్చుకున్న‌ట్లు ఈ స‌ర్వేలో తేలింది. చ‌క్కెర కంటే ఆరోగ్యానికి మేలు చేసే బెల్లం కోస‌మే ఎక్కువ ఆర్డ‌ర్లు చేశార‌ట. ఇక చికెన్ బిర్యానీలో బెంగ‌ళూరు, దాల్ కిచ‌డీలో ముంబై, చెన్నైలో ఇడ్లీ, పుణెలో మ్యాగీకి ఎక్కువ ఆర్డ‌ర్లు వ‌చ్చిన‌ట్లు స‌ర్వే తేల్చింది. 


ఇవి కూడా చ‌ద‌వండి

క్రికెట్‌ దాదా బీజేపీలో చేరుతున్నారా?

హైద‌రాబాద్ క్రికెట్‌లో అర్ధ‌రాత్రి హైడ్రామా

ఆస్ట్రేలియాలో సిరాజ్‌, శ్రీధ‌ర్ ప‌క్కా హైద‌రాబాదీ చాట్ చూశారా?

logo