బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 21:58:49

నిలకడగా మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ ఆరోగ్యం

నిలకడగా మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ ఆరోగ్యం

లక్నో : మధ్య ప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్(85)ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, క్రిటికల్ కేర్ వెంటిలేటర్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి బులెటిన్లో తెలిపింది. ట్రాకియోస్టోమీ వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో వెంటిలేటర్‌పై ఆయనను ఉంచామని మెదంతా లక్నో మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ కపూర్ తెలిపారు. మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ పదిహేనురోజుల క్రితం సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌‌కు వెళ్లి ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను లక్నోలోని మేదాంత హాస్పిటల్‌కు కుటుంబసభ్యులు తరలించారు. టాండన్‌ మూత్ర సంబంధ ఇన్‌ఫెక్షన్, జర్వంతో బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారు. ఆయనకు ఐసీయూలోనే చికిత్స కొనసాగుతోందని అన్నారు. కోవిడ్-19 పరీక్షను కూడా చేశామని, ఫలితాల్లో నెగెటివ్ వచ్చిందని పేర్కొన్నారు.


logo