శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 18:26:49

వెంటిలేటర్‌పై మధ్యప్రదేశ్ గవర్నర్

వెంటిలేటర్‌పై మధ్యప్రదేశ్ గవర్నర్

భోపాల్: మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నట్లు వైద్యులు తెలిపారు. జూన్ 11న జ్వరం, మూత్ర సంబంధ సమస్యలతో ఉత్తరప్రదేశ్ లక్నోలోని మేదాంత దవాఖానలో ఆయన చేరారు. అనంతరం ఆయనకు కాలేయం, కిడ్నీ సమస్యలున్నట్లు వైద్యులు గుర్తించారు. నాటి నుంచి మేదాంత దవాఖానలోనే లాల్జీ టాండన్ చికిత్స పొందుతున్నారు. జూన్ 30న, ఈ నెల 16న కూడా ఆయన ఆరోగ్యం విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. తాజాగా సోమవారం గవర్నర్ లాల్జీ టాండన్ ఆరోగ్యం విషమంగా ఉండటంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు మేదాంత దవాఖాన మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ కపూర్ తెలిపారు.
logo