మంగళవారం 07 జూలై 2020
National - Jun 22, 2020 , 21:51:10

నేటి రాత్రి నుంచి పూరి జిల్లాలో పూర్తిస్థాయి నిషేధాజ్ఞలు

నేటి రాత్రి నుంచి పూరి జిల్లాలో పూర్తిస్థాయి నిషేధాజ్ఞలు

పూరి : ఒడిశా రాష్ట్రంలోని పూరి జిల్లాలో వార్షిక జగన్నాథస్వామి రథయాత్రను పురస్కరించుకొని సోమవారం రాత్రి 9గంటల నుంచి బుధవారం మధ్యాహ్నం 2గంటల వరకు పూర్తిస్థాయి నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు  ఆ రాష్ట్ర డీజీపీ అభయ్‌ తెలిపారు. జిల్లా పరిపాలనా విభాగం సైతం ఇప్పటికే అధికారిక ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. రథయాత్రలో పాల్గొనేందుకు ప్రజలెవ్వరూ రావొద్దని కోరారు.

ప్రయాణికుల రైళ్లు, ప్రైవేట్‌ బస్సులు, ఇతర వ్యక్తిగత వాహనాలకు అనుమతి లేదని ప్రభుత్వ ప్రత్యేక కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారని, పోలీస్‌ వాహనాలకు, అత్యవసర వాహనాలకు మాత్రం ప్రవేశం ఉంటుందని చెప్పారు. రథయాత్రను ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీలో భక్తులు ఇంటి నుంచే వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికార యంత్రాంగానికి ప్రభుత్వం ఇప్పటికే సూచించిందన్నారు. రథయాత్ర నిర్వహణకు అనుమతించిన సుప్రీంకోర్టుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ కమిటీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో  కరోనా నియంత్రణ నియమాలు పక్కాగా అమలు చేస్తూ రథయాత్రను నిర్వహించుకోవాలని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించిన సంగతి తెలిసిందే.


logo