బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 09:50:35

కోల్‌క‌తాలో ఇవాళ సంపూర్ణ లాక్‌డౌన్‌

కోల్‌క‌తాలో ఇవాళ సంపూర్ణ లాక్‌డౌన్‌

హైద‌రాబాద్‌: ప‌శ్చిమ బెంగాల్‌లో ఇవాళ సంపూర్ణ లాక్‌డౌన్ పాటిస్తున్నారు. క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో.. రాష్ట్రంలో వారానికి రెండు రోజుల చొప్పున లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్నారు.  దానిలో భాగంగానే ఇవాళ సంపూర్ణ లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్నారు. కోల్‌క‌తా విమానాశ్ర‌యం నుంచి ఇవాళ విమానాల‌ను ఆప‌రేట్ చేయ‌డం లేదు. రాష్ట్ర‌వ్యాప్తంగా రేష‌న్ దుకాణాల‌ను కూడా బంద్ చేశారు. గురువారం కూడా రాష్ట్ర‌వ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌లు చేసిన విష‌యం తెలిసిందే.  


logo