మంగళవారం 26 మే 2020
National - May 23, 2020 , 14:10:52

బెంగుళూరులో రేపు సంపూర్ణ లాక్‌డౌన్‌

బెంగుళూరులో రేపు సంపూర్ణ లాక్‌డౌన్‌

హైద‌రాబాద్‌:  బెంగుళూరులో ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్ పాటించ‌నున్నారు. షాపులు, క‌మ‌ర్షియ‌ల్ దుకాణాల‌ను మూసివేయ‌నున్నారు.  బెంగుళూరు మ‌హాన‌గ‌ర పాలిక క‌మిష‌న‌ర్ బీహెచ్ అనిల్ కుమార్ ఓ వీడియో సందేశంలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. లాక్‌డౌన్ 1.0లో ఉన్న ఆంక్ష‌లే .. ఆదివారం కూడా వ‌ర్తిస్తాయ‌న్నారు.  పౌరులంతా ఇండ్ల‌లోనే ఉండాలంటూ ఆయ‌న ఆదేశించారు. సీఎం య‌డ్యూర‌ప్ప ఆదేశాల మేర‌కు లాక్‌డౌన్ విధించిన‌ట్లు చెప్పారు. కేవ‌లం మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ ఉంటే త‌ప్ప ఎటువంటి వాహ‌నాల‌కు అనుమ‌తి ఉండ‌దు. పోలీసు క‌మిష‌న‌ర్ భాస్క‌ర్ రావుతో ఈ విష‌యం చ‌ర్చించిన‌ట్లు అనిల్ కుమార్ తెలిపారు. 


logo