బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 11, 2020 , 20:54:29

బెంగళూరులో మళ్లీ లాక్‌డౌన్‌

బెంగళూరులో మళ్లీ లాక్‌డౌన్‌

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం కరోనా తాకిడితో వణికిపోతోంది. వరుసగా మూడో రోజూ 2వేలకు మించి కరోనా కేసులు నమోదవడంతో పాటు మరణాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.   బెంగళూరులో కరోనా వ్యాప్తి నియంత్రణకు 10 రోజుల పాటు మళ్లీ లాక్‌డౌన్‌ విధించారు. కరోనా కట్టడి కోసం జూలై 14 నుంచి  22 వరకు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ అమలు చేయనున్నారు.  

ఈనెల 14న రాత్రి 8 గంటల నుంచి జూలై 23 ఉదయం 5 గంటల వరకు బెంగళూరు  అర్బన్‌, రూరల్‌ జిల్లాల్లో  కంప్లీట్‌ లాక్‌డౌన్‌ ఉంటుందని ముఖ్యమంత్రి కార్యాలయం శనివారం తెలిపింది.   అత్యవసర సేవలు కొనసాగుతాయని  పేర్కొంది.   'నా నివాస కార్యాలయంలో కొందరికి కరోనా సోకింది. ముందు జాగ్రత్తగా నేనూ   ఇంట్లోనే ఉండి పాలన సాగిస్తానని' ముఖ్యమంత్రి యడియూరప్ప  ఒక ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే. 


logo