e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home News యూపీలో పూర్తిగా పాల‌న స్తంభ‌న‌.. మాజీ బ్యూరోక్రాట్ల ఆందోళ‌న‌

యూపీలో పూర్తిగా పాల‌న స్తంభ‌న‌.. మాజీ బ్యూరోక్రాట్ల ఆందోళ‌న‌

యూపీలో పూర్తిగా పాల‌న స్తంభ‌న‌.. మాజీ బ్యూరోక్రాట్ల ఆందోళ‌న‌

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో పూర్తిగా పాల‌న స్తంభించింద‌ని 87 మంది మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ పోలీసు అధికారులు ఆరోపించారు. రూల్ ఆఫ్ లాను ప‌చ్చిగా ఉల్లంఘిస్తున్నారని పేర్కొంటూ సోమ‌వారం బ‌హిరంగ లేఖ రాశారు. నాలుగు పేజీల ఈ లేఖ‌పై 200 మందికి పైగా ప్ర‌ముఖులు సంత‌కాలు చేశారు.

శాంతియుత నిర‌స‌న‌ల‌పై దాడులు

శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్న ఆందోళ‌న‌కారుల‌పై పోలీసులు దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌ని, ఏక‌ప‌క్ష నిర్బంధాల‌కు గురి చేస్తున్నార‌ని మాజీ ఐఏఎస్‌, మాజీ ఐపీఎస్‌, మాజీ ఐఎఫ్ఎస్ అధికారులు ఆరోపించారు. చ‌ట్ట విరుద్ధ హ‌త్య‌ల‌కు చ‌ర‌మ గీతం పాడాల‌ని కోరారు.

అస‌మ్మ‌తివాదుల‌పై జాతీయ భ‌ద్ర‌తా చ‌ట్టం దుర్వినియోగం

- Advertisement -

గోవ‌ధ పేరుతో అస‌మ్మ‌తి వాదుల‌కు వ్య‌తిరేకంగా, ల‌వ్ జిహాద్‌కు వ్య‌తిరేకంగా ముస్లింల‌ను ల‌క్ష్యంగా చేసుకుని జాతీయ భ‌ద్ర‌తా చ‌ట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నార‌ని పేర్కొన్నారు.

ప్ర‌స్తుత ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి బ‌హిరంగంగా ముస్లింల‌కు వ్య‌తిరేకంగా ప‌క్ష‌పాత పూరితంగా చ‌ర్య‌లు చేప‌ట్టింద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లోపు ఇటువంటి చ‌ర్య‌ల‌ను నిలువ‌రించ‌క‌పోతే మ‌త‌ప‌ర‌మైన ఉద్వేగాలు పెరిగిపోతాయ‌న్నారు.

200 రోజులు జైలులో జ‌ర్న‌లిస్టు

హ‌థ్రాస్ లైంగిక దాడి కేసు వార్త క‌వ‌రేజీకి వెళుతున్న కేర‌ళ జ‌ర్న‌లిస్టు సిద్ధిఖి క‌ప్ప‌న్‌ను అరెస్ట్ చేసి 200 రోజుల‌కు పైగా జైలులో ఉంచార‌ని గుర్తు చేశారు. యూపీ ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌లో లోపాల‌ను ఎత్తి చూపిన వారికి వ్య‌తిరేకంగా కేసులు పెడుతూ త‌మ వైఫ‌ల్యాల‌ను క‌ప్పి పుచ్చుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ద‌ని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి:

క‌రోనా థ‌ర్డ్ వేవ్ త‌ప్ప‌దు.. అదీ త్వ‌ర‌లోనే: ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్‌

నార్కో టెర్ర‌ర్‌ను ఆపాలి: అమిత్ షా

క‌శ్మీర్‌ను లూటీ చేసేందుకే ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు

నిబంధనలు పాటించని ఫలితం.. జన్‌పథ్‌ మార్కెట్‌ మూసివేత

ల‌ఢాక్‌లో చొర‌బ‌డిన చైనా సైనికులు.. ద‌లైలామా బ‌ర్త్‌డే వేడుకల‌పై నిర‌స‌న‌

అంత‌రిక్షం నుంచి భూమిని చూడ‌డం అద్భుతం: శిరీష బండ్ల

సీఎం ఉద్ధవ్‌ నాపై నిఘా పెట్టారు: నానా పటోల్

కొత్త‌గా పెళ్ల‌యిన జంట‌ను ఆషాఢంలో ఎందుకు ఒక్క‌చోట ఉండ‌నీయ‌రు?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
యూపీలో పూర్తిగా పాల‌న స్తంభ‌న‌.. మాజీ బ్యూరోక్రాట్ల ఆందోళ‌న‌
యూపీలో పూర్తిగా పాల‌న స్తంభ‌న‌.. మాజీ బ్యూరోక్రాట్ల ఆందోళ‌న‌
యూపీలో పూర్తిగా పాల‌న స్తంభ‌న‌.. మాజీ బ్యూరోక్రాట్ల ఆందోళ‌న‌

ట్రెండింగ్‌

Advertisement