శనివారం 06 జూన్ 2020
National - May 07, 2020 , 13:41:47

దుర్ఘటనకు కంపెనీ యాజమాన్యం బాధ్యత వహించాలి

దుర్ఘటనకు కంపెనీ యాజమాన్యం బాధ్యత వహించాలి

అమరావతి : గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనకు కంపెనీ యాజమాన్యం బాధ్యత వహించాలని ఏపీ రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గౌతం రెడ్డి తెలిపారు. ఘటనపై మంత్రి మాట్లాడుతూ... విశాఖలో ప్రమాదం జరిగిన వెంటనే స్పందించామన్నారు. ట్యాంకులో ద్రవరూపంలో ఉన్న గ్యాస్‌ను న్యూట్రల్‌ చేశామన్నారు. అదేవిధంగా పరిసరాల్లో ప్రమాద తీవ్రత తగ్గించే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఘటనకు ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీ యాజమాన్యం బాధ్యత వహించాలన్నారు. బాధితులను కాపాడుకోవడంపైనే ప్రస్తుతం తమ దృషిని కేంద్రీకరించినట్లు చెప్పారు. గ్యాస్‌ లీక్‌ ప్రాంతంలో దీర్ఘకాలిక సమస్యలపై అధ్యయనం చేస్తామన్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పరిశ్రమ పరిసరాల ప్రజలకు అన్ని రకాలుగా సాయం అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.


logo