గురువారం 13 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 12:08:57

వ్యాపార అభివృద్ధికి డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లను ఎంచుకుంటున్నారు

 వ్యాపార అభివృద్ధికి డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లను ఎంచుకుంటున్నారు

 హైదరాబాద్ : కరోనా మహమ్మారి తో అనేక వ్యాపార సంస్థలు తీవ్ర సంక్షోభాలన్నీ ఎదుర్కొంటున్నాయి. ఇదొక విధంగా ఆయా నష్టాల భారీ నుంచి గట్టెక్కాలని పలు రంగాలు వినూత్న మార్గాలను ఎంచుకుంటున్నాయి. డిజిటల్ ఫ్లాట్ ఫాం ద్వారా విక్రయాలపై దృష్టిపెట్టాయి రియల్టీ సంస్థలు. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా అమ్మకాలు పడిపోయాయి. మార్చితో ముగిసిన త్రైమాసికంలో 59శాతం తగ్గి కేవలం 26,379 యూనిట్లు మాత్రమే విక్రయాలు పరిమితం అయ్యాయి. దేశవ్యాప్తంగా టాప్ 8 ప్రాపర్టీ మార్కెట్లలో 9లక్షల 60వేల యూనిట్లు అమ్మకానికి సిద్దంగా ఉన్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో రెడీ టూ మూవ్ 2లక్షల 70వేలకు పైగానే ఉన్నాయి.

కంపెనీలు కాస్ట్ కటింగ్ అంటూ జాబ్స్ తీసేస్తున్నాయి. ఇదంతా రియల్ రంగంలో అమ్మకాలపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఆయా సంస్థలు. అటు ప్రభుత్వం నేషనల్ హౌసింగ్ బ్యాంకులోకి భారీగా నిధులు అందిస్తున్నది. 25వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. అయినా అమ్మకాలు పెరగడం లేదు. అటు మార్కెట్ కాపాడుకుంటూనే కోవిడ్ నేపథ్యంలో క్రెడాయ్, నరెడ్కో ఆన్ లైన్ ద్వారా విక్రయాలు జరిపేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి. మిడిల్ క్లాస్, ఎఫెర్డ్ బుల్ హౌసింగ్ ప్రాజెక్టులపై ప్రధానంగా దృష్టి సారించాయి. క్రెడాయ్ ఆధ్వర్యంలో ఇప్పటికే  "అవాస్ " పేరుతో పోర్టల్ ఏర్పాటుచేశారు.

"హౌజింగ్ ఫర్ ఆల్ " పేరుతో నారెడ్కో కూడా డిజిటల్ అమ్మకాలకు శ్రీకారం చుట్టింది. దాదాపు 1.21లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు అందుబాటులో ఉంటాయి. ధరలు, సదుపాయాలతో పాటు సకల సమాచారం అందులో ఉంటుంది. ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు అందులో ఉంటాయి. కోవిడ్ నేపథ్యంలో పోర్టల్ ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా… విక్రయాలు జరిపేందుకు అనుకూలంగా ఉంటుందని నారెడ్కో చెబుతున్నది.  


logo