సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 07, 2020 , 08:51:58

క‌ర్ణాట‌క‌లో క‌రోనా క‌మ్యూనిటీ ట్రాన్స్ మిష‌న్!

క‌ర్ణాట‌క‌లో క‌రోనా క‌మ్యూనిటీ ట్రాన్స్ మిష‌న్!

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క‌లో క‌మ్యూనిటీ స్థాయిలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతోంద‌ని టుముకూరు జిల్లా ఇంచార్జి మంత్రి జేసీ మ‌ధుస్వామి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. టుముకూరు కొవిడ్-19 ఆస్ప‌త్రిలో చేరిన ఎనిమిది మంది ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌న్నారు. వైద్యుల స‌మాచారం మేర‌కు వారి ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంది. రాష్ర్టంలో క‌రోనా వైర‌స్ క‌మ్యూనిటీ ట్రాన్స్ మిట్ అవుతుంద‌ని మంత్రి పేర్కొన్నారు. 

క‌ర్ణాట‌క‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 25,317 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 402 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రాష్ర్టంలో క‌రోనా నియంత్ర‌ణ‌కు ప్ర‌భుత్వం ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటుంది. 


logo