గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 18:23:19

కరోనా సమూహ వ్యాప్తి.. దేశంలో ఎప్పటి నుంచో ఉంది..

కరోనా సమూహ వ్యాప్తి.. దేశంలో ఎప్పటి నుంచో ఉంది..

న్యూఢిల్లీ: కరోనా సమూహ వ్యాప్తి దేశంలో ఎప్పటి నుంచో ఉన్నదని ఢిల్లీలోని సర్ గంగా‌రామ్ హాస్పిటల్, సెంటర్ ఫర్ చెస్ట్ సర్జరీ చైర్మన్ డాక్టర్ అరవింద్ కుమార్ తెలిపారు. దేశ వ్యాప్తంగా పలు చోట్ల కరోనా వైరస్ సమూహ వ్యాప్తికి దశకు చేరిందని ఆయన చెప్పారు. ఢిల్లీలోని కరోనా హాట్‌స్పాట్ ప్రాంతాలు, ముంబైలోని ధారవి ప్రాంతం దీనికి ఉదాహరణ అని అన్నారు. దేశంలో కరోనా వైరస్ సమూహ వ్యాప్తి దశకు చేరిందన్న భారత వైద్యుల సంఘం (ఐఎంఏ) వాదనతో తాను ఏకీభవిస్తున్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థకు డాక్టర్ అరవింద్ కుమార్  వెల్లడించారు.

మరోవైపు తిరువనంతపురంలోని పూంతురా, పుల్లువిల ప్రాంతాల్లో కరోనా వైరస్ సమూహ వ్యాప్తి దశకు చేరుకున్నదని కేరళ సీఎం పినరాయి విజయన్ శుక్రవారం మీడియాతో అన్నారు. తిరువనంతపురం తీర ప్రాంతాల్లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నదని, ఈ నేపథ్యంలో శనివారం నుంచి పూర్తి లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
logo