శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 10, 2020 , 07:42:16

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి సర్వదర్శనానికి భక్తులు నాలుగు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 67,228 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,633 మంది భక్తులు నిన్న తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.50 కోట్లు.


logo