ఆదివారం 31 మే 2020
National - May 16, 2020 , 17:00:31

కోల్‌మైన్‌ రిఫామ్స్‌ వల్ల రూ.50వేల కోట్ల పెట్టుబడులు

కోల్‌మైన్‌ రిఫామ్స్‌ వల్ల రూ.50వేల కోట్ల పెట్టుబడులు

న్యూఢిల్లీ: బొగ్గు దిగుమతులు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా బొగ్గు సరఫరా చేస్తామని చెప్పారు. ప్రస్తుతం బిడ్డింగ్‌కు 50 బొగ్గు గనులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ పథకంలో నాలుగో విడతలో 8 రంగాలకు కేటాయింపులు చేశారు.

ఈ సందర్భంగా ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బొగ్గు తవ్వకాలు, మౌలిక వసతుల కల్పన కోసం రూ.50వేల కోట్లు కేటాయిస్తున్నాం. కోల్‌మైన్‌  సంస్కరణల వల్ల రూ.50వేల కోట్ల పెట్టుబడులు. గడువులోగా బొగ్గు సరఫరా చేసినవారికి ప్రోత్సాహకాలు అందిస్తాం. బొగ్గును వాయువుగా మార్చేందుకు నూతన సాంకేతిక సాయం కూడా చేస్తాం. బొగ్గు ఉత్పత్తికి అందుబాటులో కొత్తగా 500 బ్లాకులు ఉన్నాయి. కొత్త బొగ్గు గనులను అన్వేషించేందుకు నిరంతరం ప్రయత్నిస్తాం. బాక్సైట్‌, బొగ్గు రెండూ కలిపి కేటాయింపులు చేస్తే పెట్టుబడులకు అవకాశం ఉంటుందని మంత్రి వివరించారు. logo