శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 14, 2020 , 18:31:17

ఆకాశంలో భారీ తోక‌చుక్క‌!

ఆకాశంలో భారీ తోక‌చుక్క‌!

న్యూఢిల్లీ: ఆకాశంలో ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఈ రోజు (జూలై 14) నుంచి 20 రోజులపాటు వినువీధిలో భారీ తోక‌చుక్క ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది. ఆ భారీ తోకచుక్క 6,000 ఏండ్ల‌కు ఒక‌సారి క‌నిపిస్తుంద‌ని ఖ‌గోళ శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. ఈ తోక‌చుక్క పేరు నియోవైజ్ అని, ఇది సుమారుగా ఐదు కిలోమీటర్ల వెడల్పు ఉంటుందని చెప్పారు. ఈ భారీ తోకచుక్క తన కక్షలో తిరుగుతూనే ఆరు వేల ఏండ్ల‌కు ఒక‌సారి భూమికి అతి సమీపంలోకి వ‌స్తుంద‌ని సైంటిస్టులు వెల్ల‌డించారు. 

ఈ క్రమంలోనే భారత్‌లో ఆరువేల ఏండ్ల క్రితం నియోవైజ్ ద‌ర్శ‌న‌మిచ్చింద‌ని, ఈ రోజు నుంచి ఇరవై రోజులపాటు మ‌రోసారి దర్శనమివ్వనున్న‌ద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెప్పారు. ఇర‌వై రోజుల‌పాటు ప్ర‌తిరోజు సూర్యాస్త‌మం త‌ర్వాత ఇరవై నిమిషాలపాటు వాయువ్య దిశలో ఈ తోచకుక్కను చూడవచ్చని వారు చెబుతున్నారు. 

జూలై 22, 23 తేదీల్లో భూమికి కేవ‌లం 103 మిలియన్ కిలోమీటర్ల దూరంలో నియోవైజ్ ఉంటుందని, అందుకే ఆ రెండు రోజులు తోక‌చుక్క మరింత స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. నియోవైజ్‌ను ఎలాంటి ప్ర‌త్యేక ప‌రిక‌రాల అవ‌స‌రం లేకుండా మామూలుగానే చూడవచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo