గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 04, 2020 , 14:50:53

కొవిడ్‌ దవాఖాన ఐసీయూ, వెంటిలేటర్‌ వార్డుకు కర్నల్‌ సంతోశ్‌బాబు పేరు

కొవిడ్‌ దవాఖాన ఐసీయూ, వెంటిలేటర్‌ వార్డుకు కర్నల్‌ సంతోశ్‌బాబు పేరు

న్యూ ఢిల్లీ : ఢిల్లీలోని సర్ధార్‌ వల్లభాయ్ పటేల్ కోవిడ్ దవాఖానలోని వివిధ వార్డులకు గల్వాన్ లోయలో మరణించిన 20 మంది సైనికుల పేర్లు పెట్టనున్నట్లు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) నిర్ణయం తీసుకుంది. గాల్వన్ అమరవీరుల గుర్తుగా ఈ పేర్లు పెట్టనున్నట్లు డీఆర్‌డీఓ అధికారులు తెలియజేశారు. గాల్వన్‌లో అమరుడైన భారత ఆర్మీ ఆఫీసర్‌ కర్నల్‌ సంతోశ్‌బాబు పేరును ఐసీయూ వార్డుకు పెట్టాలని డీఆర్‌డీఓ నిర్ణయించకున్నట్లు ఆ శాఖ చైర్మన్, సాంకేతిక సలహాదారుడు సంజీవ్ జోషి తెలిపారు.  

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ఈ దవాఖానను ఆదివారం ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 1000 పడకలున్న ఈ దవాఖనలో కొవిడ్‌19 వ్యాధి గ్రస్తులకు చికిత్సనందించడం కోసం ప్రత్యేక ఐసీయూలు నిర్మించినట్లు జోషి తెలిపారు. దవాఖానకు చెందిన ఐసీయూ, వెంటిలేటర్ వార్డుకు కర్నల్‌ సంతోశ్‌బాబు పేరు పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. 

జూన్‌ 15న భారత్‌, చైనా మధ్య జరిగిన ఘర్షణలో ఇండియాకు చెందిన 20 మంది ఆర్మీ సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo