సోమవారం 13 జూలై 2020
National - Jun 17, 2020 , 13:13:53

కర్నల్‌ సంతోశ్ చివ‌రి ఫోన్‌కాల్ వారికే..‌

కర్నల్‌ సంతోశ్ చివ‌రి ఫోన్‌కాల్ వారికే..‌

హైద‌రాబాద్ : గాల్వ‌న్‌లో వీర‌మ‌ర‌ణం పొందిన క‌ల్న‌ల్ సంతోశ్‌బాబు .. చివ‌రి సారి త‌మ పేరెంట్స్‌తో ఈనెల 14న ఫోన్‌లో మాట్లాడారు.  చైనా స‌రిహ‌ద్దు వ‌ద్ద ఉద్రిక్త‌త నెల‌కొన్న నేప‌థ్యంలో.. సురేశ్ పేరెంట్స్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.  అప్పుడు క‌ల్న‌ల్ సంతోశ్‌.. తన త‌ల్లితండ్రుల‌కు ధైర్యాన్ని నింపారు.  మీరు న‌న్ను ఆర్మీకి పంపారు, ఇప్పుడు న‌న్ను నా డ్యూటీ చేయ‌నివ్వండి అంటూ క‌ల్న‌ల్ సంతోశ్ త‌న పేరెంట్స్‌కు ఫోన్‌లో తెలిపిన‌ట్లు స‌మాచారం. స‌రిహ‌ద్దు స‌మ‌స్య గురించి మీరు అడ‌గ‌వ‌ద్దు అని, నేను మీకు అన్నీ చెప్ప‌లేన‌ని, అంతా బాగుంద‌ని క‌ల్న‌ల్ సంతోశ్ ఆ ఫోన్‌లో తెలిపాడు.  

క‌ల్న‌ల్ సంతోశ్ గురించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పేరెంట్స్ తెలియ‌జేశారు.  ఆర్మీ ఉన్నతాధికారుల నుంచి క‌ల్న‌ల్ సంతోష్ ఎప్పుడూ ప్ర‌శంస‌లు పొందేవార‌న్నారు.  కోరుకొండ‌లోని సైనిక్ స్కూల్‌లో అత‌ను చ‌దువుకున్నాడు.  అప్పుడు అత‌ను ర‌క్ష‌ణ రంగం వైపు దృష్టిపెట్టారు.  2003లో అత‌ను ఎన్డీఏ అకాడమీ ప‌రీక్ష పాస‌య్యాడు. ఆ త‌ర్వాత భార‌త మిలిట‌రీ అకాడ‌మీలో చేరాడు. 

క‌ల్న‌ల్ సంతోశ్ బాబు త‌న విధుల్లో భాగంగా.. కాంగో, శ్రీన‌గ‌ర్‌, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ప‌నిచేశారు. గ‌త ఏడాది నుంచి అత‌ను ల‌డ‌ఖ్‌లో విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. క‌శ్మీర్‌లోని కుప్వారాలో ఉగ్ర‌వాదుల‌ను అంతం చేయ‌డంలో క‌ల్న‌ల్ సంతోశ్ కీల‌క పాత్ర పోషించారు. క‌ల్న‌ల్ సంతోశ్ తండ్రి ఉపేంద‌ర్ బ్యాంక్ మేనేజ‌ర్‌గా చేసి రిటైర‌య్యారు.  కొడుకును ఆర్మీకి పంపాల‌న్న‌ది త‌న కోరికే అని , అత‌ని విజ‌యాలు చూసి గ‌ర్వ‌ప‌డ్డాన‌ని, త‌న చిన్న‌నాటి స్వ‌ప్నాలు నిజ‌మైన‌ట్లు అనిపించింద‌ని క‌ల్న‌ల్ సంతోశ్ తండ్రి తెలిపారు.  logo