బుధవారం 27 జనవరి 2021
National - Jan 02, 2021 , 01:13:34

సియాచిన్‌ హీరో కన్నుమూత

సియాచిన్‌ హీరో కన్నుమూత

  • అనారోగ్యంతో నరేంద్రకుమార్‌ మృతి
  • సియాచిన్‌ స్వాధీనంలో కీలక పాత్ర
  • ఆయన సూచనలతోనే ఆపరేషన్‌ మేఘదూత్‌

న్యూఢిల్లీ, జనవరి 1: సియాచిన్‌ హీరో, రిటైర్డ్‌ కర్నల్‌ నరేంద్రకుమార్‌ అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. ఆయన వయస్సు 87 ఏండ్లు. భారత్‌ సియాచిన్‌ను స్వాధీనం చేసుకోవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. పర్వతారోహణలో దిట్ట అయిన నరేంద్ర కుమార్‌ రూపొందించిన నివేదికల ఆధారంగానే భారతప్రభుత్వం 1984లో ఆపరేషన్‌ మేఘదూత్‌ నిర్వహించి సియాచిన్‌ను అధీనంలోకి తీసుకొన్నది. అంతకుముందు పాక్‌ సైనికులు సియాచిన్‌లో సంచరించడంపై కూడా ఆయనే ప్రభుత్వానికి సమాచారం అందించారు. నరేంద్ర కుమార్‌ 1933లో రావల్పిండిలో (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది) జన్మించారు. 1970, 80ల్లో సియాచిన్‌ ప్రాంతంలో ఎన్నో సాహసయాత్రలు చేశారు. కీర్తిచక్ర, పద్మశ్రీ, అర్జున అవార్డులతో పాటు ప్రతిష్ఠాత్మక మెక్‌గ్రెగర్‌ అవార్డును కూడా పొందారు. ఎవరెస్టు, కాంచనజంగ తదితర పర్వతాలను అధిరోహించారు. నందాదేవి  పర్వతం అధిరోహించిన మొదటి భారతీయుడిగా రికార్డు సృష్టించారు.


logo