మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 17, 2020 , 12:29:54

తెరుచుకున్న డిగ్రీ కాలేజీలు.. త‌క్కువ సంఖ్య‌లో విద్యార్థులు హాజ‌రు

తెరుచుకున్న డిగ్రీ కాలేజీలు.. త‌క్కువ సంఖ్య‌లో విద్యార్థులు హాజ‌రు

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి వ‌ల్ల గ‌త 8 నెలల నుంచి మూత‌ప‌డ్డ కాలేజీలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి.  క‌ర్నాట‌క రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి డిగ్రీ కాలేజీలు రీఓపెన్ అయ్యాయి.  అనేక ఆంక్ష‌ల న‌డుమ కాలేజీలు తెరిచారు. చాలా వ‌ర‌కు కాలేజీల్లో విద్యార్థులు స్వ‌ల్ప సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు.  కోవిడ్‌19 ప‌రీక్ష కోసం స్వాబ్ శ్యాంపిళ్లు ఇవ్వ‌డం .. ఆ ఫ‌లితాలు ఆల‌స్యం కావ‌డం వ‌ల్ల విద్యార్థులు కాలేజీల‌కు అధిక సంఖ్య‌లో హాజ‌రుకాలేక‌పోయారు.  కోవిడ్ నెగ‌టివ్ స‌ర్టిఫికేట్ ఇచ్చిన విద్యార్థులు, స్టాఫ్‌ను మాత్ర‌మే కాలేజీల‌కు అనుమ‌తి ఇస్తున్నారు. కేవ‌లం ఫైన‌ల్ ఇయ‌ర్ విద్యార్థుల‌కు మాత్ర‌మే క్లాసులు నిర్వ‌హిస్తున్నామ‌ని క‌ర్నాట‌క ప్ర‌భుత్వ కాలేజీ టీచ‌ర్ల సంఘం అధ్య‌క్షుడు టీఎం మంజూనాథ్ తెలిపారు. కేవ‌లం ప‌ది నుంచి 20 శాతం మంది విద్యార్థులు మాత్ర‌మే కాలేజీకి వ‌చ్చేందుకు ఆస‌క్తి చూపిన‌ట్లు ఆయ‌న చెప్పారు.  

ఇక ఢిల్లీలోని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ యూనివ‌ర్సిటీ .. విద్యార్థుల‌కు దశ‌ల‌వారీగా ప్ర‌వేశం క‌ల్పిస్తున్న‌ది.  పీహెచ్‌డీ రీస‌ర్చ్ స్కాల‌ర్ చ‌దువుతున్న ఫైన‌ల్ ఇయ‌ర్ విద్యార్థులు సోమ‌వారం నుంచి కాలేజీకి వ‌స్తున్నారు. హాస్ట‌ల్ విద్యార్థులు ద‌శ‌ల‌వారీగా వ‌స్తున్నారు.  డిసెంబ‌ర్ 31లోగా థీసీస్ ప్ర‌జెంట్ చేయాల్సి ఉన్న విద్యార్థుల‌కు ఈ అవ‌కాశం క‌ల్పించిన‌ట్లు యూనివ‌ర్సిటీ తెలిపింది.  జేఎన్‌యూ విద్యార్థులు వ‌ర్సిటీకి రాగానే డిక్ల‌రేష‌న్ ద‌ర‌ఖాస్తు స‌మ‌ర్పించాల‌ని డీన్ సుధీర్ ప్ర‌తాప్ సింగ్ తెలిపారు.