శనివారం 28 నవంబర్ 2020
National - Nov 16, 2020 , 16:08:30

క‌ర్ణాట‌క‌లో రేప‌టి నుంచి కాలేజీలు ప్రారంభం!

క‌ర్ణాట‌క‌లో రేప‌టి నుంచి కాలేజీలు ప్రారంభం!

బెంగ‌ళూరు: రేప‌టి నుంచి కాలేజీల‌ను ప్రారంభించ‌డానికి కర్ణాట‌క ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. డిగ్రీ, ఇంజినీరింగ్‌, డిప్లొమా కాలేజీల్లో మంగ‌ళ‌వారం నుంచి త‌ర‌గ‌తులు ప్రారంభ‌మ‌వుతాయ‌ని వెల్ల‌డించింది. ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు తాము రేప‌టి నుంచి కాలేజీల‌ను ప్రారంభించ‌బోతున్నామ‌ని క‌ర్ణాట‌క విద్యాశాఖ అధికారులు తెలిపారు. అయితే, ప్ర‌స్తుతం ఉన్న‌త విద్యకు సంబంధించిన కాలేజీలను మాత్ర‌మే ప్రారంభిస్తున్నామ‌ని.. స్కూళ్లు, జూనియ‌ర్ కాలేజీల ప్రారంభంపై ప్రాథ‌మికోన్న‌త విద్యావిభాగం నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంద‌ని చెప్పారు.  

కాగా, మెడిక‌ల్‌, డెంట‌ల్‌, పారా మెడిక‌ల్‌, న‌ర్సింగ్, ఆయుష్ కాలేజీలు డిసెంబ‌ర్ 1వ తారీఖు నుంచి ప్రారంభ‌మ‌వుతాయ‌ని క‌ర్ణాట‌క ఉన్న‌త విద్యాశాఖ అధికారులు తెలిపారు. అయితే కాలేజీల‌కు హాజ‌ర‌య్యే అధ్యాప‌కులు, విద్యార్థులు, ఇత‌ర సిబ్బంది త‌ప్ప‌నిస‌రిగా క‌రోనా నెగెటివ్ రిపోర్టు స‌మ‌ర్పించాలని ఆదేశించారు. అదేవిధంగా విద్యార్థులు త‌ల్లిదండ్రుల నుంచి నో అబ్జె‌క్ష‌న్ స‌ర్టిఫికెట్ తీసుకురావాల‌ని చెప్పారు. కాగా, క‌రోనా మ‌హ‌మ్మారి కారణంగా లాక్‌డౌన్ విధించ‌డంతో అన్ని రాష్ట్రాల‌తోపాటు క‌ర్ణాట‌క‌లోనూ గ‌త మార్చి నుంచి స్కూళ్లు, కాలేజీలు మూత‌ప‌డ్డాయి. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.