సోమవారం 28 సెప్టెంబర్ 2020
National - Aug 10, 2020 , 10:15:07

కోజికోడ్ ప్ర‌మాదం.. కాలేజీ ల‌వ్ స్టోరీకి విషాద ముగింపు

కోజికోడ్ ప్ర‌మాదం.. కాలేజీ ల‌వ్ స్టోరీకి విషాద ముగింపు

హైద‌రాబాద్‌: కేర‌ళ‌లోని కోజికోడ్‌లో జ‌రిగిన విమానం ప్ర‌మాదం.. ఎందరో జీవితాల‌ను విషాదంలోకి నెట్టేసింది. పెళ్లి కోసం ఇండియాకు వ‌స్తున్న మ‌హ‌మ్మ‌ద్ రియాస్ అనే యువ‌కుడిని ఆ ప్ర‌మాదం మింగేసింది. 24 ఏళ్ల రియాస్ కాలేజీలో త‌న జూనియ‌ర్ అమ్మాయి హ‌న్యాను ప్రేమించాడు. అయితే పెద్దల‌ అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాల‌నుకున్నాడు. దుబాయ్‌లో ఉద్యోగం కోసం వెళ్లిన అత‌ను.. పెళ్లి కోసం ఇండియా వెళ్తున్న‌ట్లు త‌న ద‌ర‌ఖాస్తులో పేర్కొన్నాడు.  సోద‌రుడు నిజాముద్దీన్ కూడా రియాస్‌తో పాటు ఎయిర్ ఇండియా ఫ్ల‌యిట్ ఎక్కాడు.  రియాస్ త‌న కాలేజీ రోజుల్లో స్టూడెంట్ నాయ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.  వాస్త‌వానికి హ‌న్యాతో పెళ్లి ఎప్పుడో జ‌రుగాల్సి ఉంది. కానీ క‌రోనా నేప‌థ్యంలో మ్యారేజీని వాయిదా వేశారు.  రియాస్ ఎప్పుడు వ‌స్తే అప్పుడు పెళ్లి జ‌రుగుతంద‌ని ఫిక్స్ అయ్యారు.  దుబాయ్ నుంచి ఫ్ల‌యిట్ టికెట్ దొర‌క‌గానే అంద‌రూ సంతోషించారు. కానీ కోజికోడ్ ల్యాండింగ్ ప్ర‌మాదం .. రియాస్ క‌ల‌ల్ని చిదిమేసింది. ఆ విమాన ప్ర‌మాదంలో రియాస్ చ‌నిపోగా.. అత‌ని సోద‌రుడు నిజాముద్దీన్ మాత్రం గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. 

అయితే ఇదే విమానంలో మ‌రో యువ‌కుడు పెళ్లి కోస‌మే కేర‌ళ‌కు వ‌చ్చాడు. ప‌ర‌మేశ్వ‌ర‌న్ అనే ఆ యువ‌కుడు మాత్రం విమాన ప్ర‌మాదంలో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు.  త‌న సోద‌రుడు, వ‌దిన‌ల‌తో క‌లిసి ఎయిర్ ఇండియా విమానంలో ప‌ర‌మేశ్వ‌ర్ వ‌చ్చాడు. సెప్టెంబ‌ర్ 10వ తేదీన అత‌ని పెళ్లి ఫిక్స్ అయ్యింది. అయితే ఈ ప్ర‌మాదంలో ముగ్గురూ సుర‌క్షితంగా ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. కానీ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌కు వెన్నుపూస స‌ర్జ‌రీ చేయాల్సి వ‌చ్చింది.
logo