శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 15, 2020 , 13:36:23

కలెక్టర్‌కు కరోనా పాజిటివ్‌..ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స

కలెక్టర్‌కు కరోనా పాజిటివ్‌..ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స

చెన్నై:  తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా కలెక్టర్‌  కే రాజమణికి  కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  ప్రస్తుతం ఆయన  ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్నారు.  సోమవారం ఉదయం నుంచి కలెక్టర్‌ జ్వరంతో బాధపడుతుండగా మంగళవారం ఆయనకు కరోనా  నిర్ధారణ పరీక్షలు చేశారు. కలెక్టర్‌కు కరోనా సోకినట్లు బుధవారం జిల్లా వైద్యాధికారులు తెలిపారు.   కోవై మెడికల్‌ సెంటర్‌ అండ్‌ హాస్పిటల్‌లో కలెక్టర్‌ కరోనా చికిత్స తీసుకుంటున్నారు. 

కరోనా నియంత్రణ నేపథ్యంలో కలెక్టర్‌ కంటైన్మెంట్‌ జోన్లలో పర్యటించారని జిల్లా వైద్యాధికారి  రామదురై మురుగన్‌ తెలిపారు. కలెక్టర్‌లో కరోనా లక్షణాలేవీ కనిపించలేదని చెప్పారు.  తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 1,47,324కు పెరిగింది. ప్రస్తుతం 47,915 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 2,099 మంది చనిపోయారు. logo