శనివారం 28 నవంబర్ 2020
National - Oct 28, 2020 , 13:07:50

కాగ్నిజెంట్‌కు నూతన ఛైర్మన్...నియామకం

 కాగ్నిజెంట్‌కు నూతన ఛైర్మన్...నియామకం

ఢిల్లీ : ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌కు నూతన ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా రాజేశ్ నంబియార్‌ను నియమించారు. నవంబరు 9 నుంచి ఆయన నియామకం అమలులోకి రానున్నట్లు కాగ్నిజెంట్ ప్రకటించింది.  ప్రస్తుతం ఆయన నెట్‌వర్కింగ్‌, సిస్టమ్స్‌ అండ్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ సియెనా ఇండియా ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో సభ్యుడిగా కూడా సేవలందించనున్నారు. రాజేశ్‌ నంబియార్‌ గతంలో ఐబీఎంలో వివిధ హోదాల్లో 12ఏండ్ల పాటు సేవలందించారు. అనంతరం టీసీఎస్‌లో 18ఏండ్లు పనిచేశారు. నాస్కామ్‌ కార్యనిర్వాహక మండలి సభ్యుడిగానూ పనిచేసిన అనుభవం ఉన్నది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.