శనివారం 28 మార్చి 2020
National - Feb 10, 2020 , 01:50:16

శునకానికి పేస్‌మేకర్‌

శునకానికి పేస్‌మేకర్‌
  • దేశంలోనే తొలిసారి.. ఢిల్లీలో ఘటన

న్యూఢిల్లీ: ఏడున్నరేండ్ల వయసున్న ఓ కుక్కకు శస్త్ర చికిత్స చేసి పేస్‌మేకర్‌(గుండె స్పందనలను ప్రేరేపించే యంత్రం)ను అమర్చారు. ఇలాంటి ఘటన దేశంలో జరుగడం ఇదే తొలిసారని పశు వైద్యులు తెలిపారు. గుర్గావ్‌కు చెందిన ఓ నివాసి కాకర్‌ స్పెనియల్‌ జాతికి చెందిన ఓ ఆడ శునకాన్ని పెంచుకుంటున్నాడు. దాని పేరు ఖుషి. కొంతకాలంగా మూర్ఛపోవడాన్ని గమనించిన యజమాని, మ్యాక్స్‌ పశు దవాఖాన వైద్యులకు చూపించాడు. ఖుషిని పరీక్షించిన వైద్యులు దాని గుండె నాళాల్లో రక్త ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడ్డాయని నిర్ధారించారు. సాధారణంగా కుక్క గుండె నిమిషానికి 60 నుంచి 120 సార్లు కొట్టుకుంటుందని, అయితే ఖుషి గుండె 20 సార్లే కొట్టుకుంటున్నదని.. ఇది ఇలాగే కొనసాగితే దాని ప్రాణానికి ప్రమాదమన్నారు. పశు వైద్యుడు భాను దేవ్‌ శర్మ గత డిసెంబర్‌ 15న గంటన్నర పాటు శ్రమించి ఖుషి గుండెకు పేస్‌మేకర్‌ను అమర్చారు. 


logo