బుధవారం 21 అక్టోబర్ 2020
National - Sep 23, 2020 , 22:13:31

తెలుగురాష్ట్రాల్లో కోక- కోలా ఇండియా సురక్షిత తాగునీటి కేంద్రాలు ఏర్పాటు

 తెలుగురాష్ట్రాల్లో కోక- కోలా ఇండియా సురక్షిత తాగునీటి కేంద్రాలు ఏర్పాటు

హైదరాబాద్ : కోక- కోలా ఇండియా ఫౌండేషన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ తదితర జిల్లాలలో జలధార ఫౌండేషన్, వాటర్ హెల్త్ ఇండియాలతో కలసి ఏడు వాటర్ హెల్త్ సెంటర్స్(డబ్ల్యూహెచ్ సి)ను ఏర్పాటు చేసింది. ఆయా జిల్లాలకు చెందిన 20,000 మందికి నీటి శుద్ధి కేంద్రాలు , సుస్థిరదాయక జీవనోపాధి కల్పించే లక్ష్యంతో ఈ ఫౌండేషన్ ముందుకు వచ్చింది.

కోక-కోలా ఇండియా అండ్ సౌత్ వెస్ట్ ఏషియా వైస్ ప్రెసిడెంట్ (పబ్లిక్ అఫైర్స్, కమ్యూనికేషన్ & సస్టెయినబిలిటీ) ఇష్తెయాక్యూ అంజాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘జీవించేందుకు నీళ్లు తప్పనిసరి. ఆర్యోగవంతమైన సమాజానికి, సురక్షిత తాగు నీళ్లు చాల అవసరం. స్థానిక భాగస్వామ్యంతో కోక-కోలా ఇండియా ఫౌండేషన్ భారతదేశవ్యాప్తంగా గత పదేళ్లుగా సురక్షిత , పరిశుభ్రమైన తాగునీటిని అందించే పరిష్కారాల్లో భాగమవుతూ తన వంతు తోడ్పాటును అందిస్తున్నదని అన్నారు.  

 జలధార ఫౌండేషన్‌కు చెందిన బి.రామానంద్ మాట్లాడుతూ, ‘‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నీటి ద్వారా వ్యాధులు వ్యాప్తి చెందడం అధికమవడం, దానికి తోడు పరిశ్రమ వర్గాల నివేదికల ప్రకారం భూగర్భజలాలు నిరంతరం కలుషితం కావడం ఈ ప్రాంతాల ప్రజల తాగునీటి కష్టాలకు నిదర్శనంగా ఉంటున్నాయి. నీటి పరిష్కారాలను అమలు చేసినప్పుడు గ్రామీ ణులు దీర్ఘకాలంలో గొప్ప ప్రయోజనాలు పొందగలుగుతారని మేము ఆశిస్తున్నాం. వినూత్నంగా ఆలోచనలు సాధ్యపడే పరిష్కారాలకు గాను కోక-కోలా ఇండియా కు, మా సాంకేతిక భాగస్వామి వాటర్ హెల్త్ ఇండియాకు మా ధన్య వాదాలు’’ అని చెప్పారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


logo