ఆదివారం 05 జూలై 2020
National - Apr 15, 2020 , 10:47:06

బైక్‌లోని పాముని వాట‌ర్ క్యాన్ లోకి పంపిన యువ‌కుడు

బైక్‌లోని పాముని వాట‌ర్ క్యాన్ లోకి పంపిన యువ‌కుడు

ఒక‌ప్పుడు చెట్ల పొద‌ల్లోనో లేక పుట్ట‌ల్లోనో క‌నిపించే పాములు ఇప్పుడు ఇళ్ల‌ల్లోకి వ‌చ్చేస్తున్నాయి. అంత‌టితో ఆగ‌కుండా బైకు హెడ్ లైట్స్ లోకి లేదంటే డూమ్స్ లోకి దూరి ప్ర‌శాంతంగా నిద్ర‌పోతున్నాయి. కొద్ది రోజుల క్రితం యాక్టివా హెడ్ ల్యాంప్‌లో ఉన్న‌ పాముకి సంబంధించిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో ఫుల్ వైర‌ల్ అయింది. తాజాగా అలాంటి సంఘ‌ట‌న‌నే మ‌రొక‌టి జ‌రిగింది.

లాక్ డౌన్ వ‌ల‌న ప్ర‌జ‌లు ఇళ్ళ నుండి బ‌య‌ట‌కి పోయే ప‌రిస్థితులు లేని నేప‌థ్యంలో బైక్‌ల‌ని ప‌క్క‌న  పార్కింగ్ చేసి ఉంచుతున్నారు. ఈ నేప‌థ్యంలో పాములు మంచిగా బైక్‌ల‌లోకి దూరి ప్ర‌శాంతంగా నిద్రిస్తున్నాయి. తాజాగా నాగుపాము ఒక‌టి యాక్టివా డూమ్ ప్రాంతంలో దూరి ఉండ‌గా, దానిని గ‌మ‌నించిన బైక్ ఓన‌ర్ పాముల‌ని ప‌ట్టే నిపుణుల‌కి స‌మాచారం అందిచారు. అత‌ను దానిని తెలివిగా వాట‌ర్ క్యాన్‌లోకి ప్ర‌వేశించేలా చేశాడు. ఆ త‌ర్వాత క్యాన్ మూత పెట్టేసాడు.  పాముని బాటిల్‌లోకి పంపే దృశ్యాన్ని చూస్తున్న చుట్టు ప‌క్క‌ల ప్ర‌జ‌ల భ‌యంతో కేక‌లు వేశారు.

పాముని ప‌ట్టుకున్న నిపుణుడు దానిని అర‌ణ్యంలో వ‌దిలి వేసేందుకు ప్ర‌యత్నించ‌గా, దాని మూతికి ప్లాస్టిక్ క్యాప్ ఒక‌టి చుట్టుకు పోయింది. దీనిని ఎంతో తెలివిగా ఇద్ద‌రు యువ‌కులు తొల‌గించారు. వారి దాన్ని తొలగించడానికి అపార‌మైన ధైర్యాన్ని క‌న‌బ‌రిచారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న ఈ వీడియో నెటిజ‌న్స్ ని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది.  


logo