సోమవారం 21 సెప్టెంబర్ 2020
National - Aug 05, 2020 , 10:39:33

కోబ్రాతో పోరాడేందుకు గుంపుతో వ‌చ్చిన మీర్క‌ట్స్ ముఠా : వీడియో వైర‌ల్‌

కోబ్రాతో పోరాడేందుకు గుంపుతో వ‌చ్చిన మీర్క‌ట్స్ ముఠా :  వీడియో వైర‌ల్‌

ఎడారిని త‌ల‌పించే ప్ర‌దేశంలో కోబ్రాకు మీర్క‌ట్స్ ఎదురుప‌డ్డాయి. మీర్క‌ట్ల‌ను క‌రిచేందుకు కోబ్రా విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ది. దీనికి మీర్క‌ట్స్ కామ్‌గా ఉంటాయా? అవి కూడా తిరిగి దాడి చేస్తున్నాయి. యుద్ధం కొంత స‌మ‌యం వ‌ర‌కు కొన‌సాగింది. కానీ, గుంపుగా ఉన్న మీర్క‌ట్స్‌ల‌ను కోబ్రా ఓడించేసింది. ఈ వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ సుశాంత నందా ట్విట‌ర్‌లో షేర్ చేశారు.

మీర్క‌ట్స్ అనేది ద‌క్షిణ ఆఫ్రికాలో క‌నిపించే ఒక చిన్న ముంగూస్‌. 59 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గానే వైర‌ల్‌గా మారింది. 'మీర్కట్ గ్యాంగ్ వర్సెస్ కోబ్రా. వినోదభరితమైన స్టాండ్ఆఫ్' అనే శీర్షిక‌ను జోడించారు. ఈ వీడియోను చూసేందుకు నెటిజ‌న్లు ఇష్ట‌ప‌డుతున్నారు. 


logo