నేటి నుంచి రెండు రోజుల పాటు సీ-విజిల్ 21

ముంబై : నావికా దళం, తీర ప్రాంత రక్షణ దళం ఆధ్వర్యంలో మంగళవారం నుంచి రెండు రోజుల పాటు సీ విజిల్-21 కార్యక్రమం జరుగనుంది. 7516 కిలోమీటర్ల తీర ప్రాంతమున్న 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొనసాగనుంది. దీని ద్వారా బలాలు, బలహీనతల గురించి వాస్తవిక అంచనాను అందిస్తోంది, తద్వారా సముద్ర, జాతీయ భద్రతను మరింత బలోపేతం చేసేందుకు సహాయపడనుంది. ముంబై 26/11 ఉగ్రదాడి సముద్రమార్గం ద్వారా దేశంలోకి ప్రవేశించి చేసిన ఘటనే. భవిష్యత్‌లో ఈ తరహా దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టే విధానాలు, అందుబాటులోకి వచ్చిన ఆధునిక వ్యవస్థలను ఎక్సర్సైజ్ సీ విజిల్ పేరిట నిర్వహిస్తున్నారు.
అతిపెద్ద తీరప్రాంత విన్యాసాలను నౌకాదళం సమన్వయం చేస్తోంది. 13 రాష్ట్రాల సహా కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించిన తీర రక్షణకు సంబంధిచి నౌకా వాణిజ్య వర్గాలు, మత్స్యకారులు, అనుబంధ ప్రజానీకాన్ని సమన్వయం చేస్తూ ఈ విన్యాసాలు సాగనున్నాయి. నౌకాదళంతో పాటు రక్షణ, హోం, పెట్రోలియం, ఓఎన్జీసీ, ఫిషరీస్, కస్టమ్స్ తదితర కేంద్ర ప్రభుత్వ శాఖలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వ విభాగాలతో ఈ విన్యాసాలు జరగనున్నాయి.
సీ విజిల్ విన్యాసాల ప్రధాన ఉద్దేశం సముద్రంలోను, తీరంలోను ఎదురయ్యే ఉగ్రవాద కార్యకలాపాల నియంత్రణ, అణచివేత దీంట్లో అంశాలుగా ఉండనున్నాయి. నౌకాదళంతో పాటు కోస్ట్‌గార్డ్ సహా రాష్ట్రాల మెరైన్ పోలీసుల సహకారంతో నిర్వహిస్తారు. తీర ప్రాంతంలో కట్టుదిట్టమైన నిఘాతో పాటు ప్రస్తుతం ఉన్న భద్రత చర్యలను మరోసారి పర్యవేక్షిస్తారు. లోపాలను సరిదిద్దుకుంటూనే భవిష్యత్‌లో సాంకేతికంగా ఎదురయ్యే సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొనే విధంగా సీ విజిల్ జరుగుతుంది.
తాజావార్తలు
- నేడు ఐసెట్ మూడో విడుత కౌన్సెలింగ్ షెడ్యూల్
- చరిత్ర సృష్టించిన సెన్సెక్స్
- బీజేపీలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త
- నేపాల్, బంగ్లాకు 30 లక్షల డోసుల కొవిషీల్డ్ వ్యాక్సిన్
- కల్తీ కల్లు ఘటన.. మత్తు పదార్థాలు గుర్తింపు
- స్వాతిలో ముత్యమంత సాంగ్‌ని రీమిక్స్ చేసిన అల్లరోడు-వీడియో
- ఫస్టియర్ ఫెయిలైన వారికి పాస్ మార్కులు!
- సింగరేణిలో భారీగా ట్రైనీ ఉద్యోగాలు
- అమ్మకు గుడి కట్టిన కుమారులు..
- టర్పెంటాయిల్ పోసి నిప్పంటించిన ఘటనలో బాలుడి మృతి