గురువారం 26 నవంబర్ 2020
National - Nov 07, 2020 , 21:49:24

అండమాన్ సమీపంలో మయన్మార్‌ పడవ పట్టివేత

అండమాన్ సమీపంలో మయన్మార్‌ పడవ పట్టివేత

పోర్ట్ బ్లెయిర్ : మయన్మార్‌కు చెందిన అనుమానాస్పద పడవను అండమాన్, నికోబార్ దీవుల సమీపంలో ఇండియన్ కోస్ట్ గార్డ్స్‌ శనివారం పట్టుకున్నది. ఈ పడవలో 12 మంది మయన్మార్‌ సిబ్బంది ఉన్నట్లు గుర్తించారు. పడవను మొదట హెలికాప్టర్ ద్వారా గుర్తించిన అధికారులు.. అనంతరం కోస్ట్‌ గార్డ్స్‌ వెంబడించి పట్టుకుని వారిని విచారించడానికి పోర్ట్ బ్లెయిర్కు తీసుకెళ్తున్నారు. వీరు ఎక్కడి నుంచి బయల్దేరారు.. ఎక్కడికి వెళ్తున్నారు.. వీరిని ఎవరు పంపించారు.. అనే విషయాలపై కోస్ట్‌ గార్డ్స్‌ ఆరా తీస్తున్నారు.

అంతకుముందు, అక్టోబర్ 24 న కోస్ట్ గార్డ్ ఆరుగురు శ్రీలంక మత్స్యకారులను భారతీయ జలాల్లో చేపలు పట్టేందుకు రాగా అరెస్టు చేసింది. కరైకల్ నుంచి 75 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న శ్రీలంక నౌకను నిఘా విమానంలో ఉన్న ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది గుర్తించారు. ఈ సమాచారాన్ని ఇండియన్ కోస్ట్ గార్డ్ పెట్రోలింగ్ నౌక ఐసీజీఎస్ అభీక్‌కు పంపించారు. "శ్రీలంక నౌక అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖను దాటి మా సిబ్బంది గుర్తించినప్పుడు భారత జలాల్లోకి ప్రవేశించింది. మా నౌక ఐసీజీఎస్ అభీక్ దాని వద్దకు చేరుకున్న సమయంలో.. శ్రీలంక నౌక తప్పించుకోవడానికి ప్రయత్నించింది. మేం దానిని వెంటాడి మత్స్యకారులను అరెస్టు చేసాం” అని కరైకల్‌లోని ఇండియన్ కోస్ట్ గార్డ్ యూనిట్ కమాండింగ్ ఆఫీసర్ కమాండెంట్ సీ వివేకానంద తెలిపారు. గత సంవత్సరంలో కోస్ట్ గార్డ్ మయన్మారీస్ పడవను లిటిల్ అండమాన్ తూర్పు 125 నాటికల్ మైళ్ళ దూరంలో నిషేధించిన ప్రాంతంలో పట్టుకున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.