బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Feb 26, 2020 , 18:54:13

కేంద్రమంత్రి జవదేకర్ కు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు

కేంద్రమంత్రి జవదేకర్ కు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేసినందుకు కేంద్రమంత్రి జవదేకర్ కు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ తోపాటు ఎంపీలు సంతోష్ కుమార్, కొత్త ప్రభాకర్ రెడ్డి, నామా నాగేశ్వర్ రావు, మన్నె శ్రీనివాస్ రెడ్డి, బీబీ పాటిల్, కే కేశవరావు కేంద్రమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం నిన్న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేసిన విందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరైన విషయం తెలిసిందే. logo
>>>>>>