శుక్రవారం 15 జనవరి 2021
National - Dec 24, 2020 , 15:55:12

ఫిబ్రవరి 22 నుంచి సీమ్యాట్‌ పరీక్షలు

ఫిబ్రవరి 22 నుంచి సీమ్యాట్‌ పరీక్షలు

న్యూఢిల్లీ : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) 2021 కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీఎమ్‌ఏటీ) కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా సిమాట్ 2021 కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు 22 జనవరి 2021 వరకు cmat.nta.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వీటి పరీక్షలు ఫిబ్రవరి 22 నుంచి జరిపేందుకు ఎన్‌టీఏ ఏర్పాట్లు చేసింది. కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీమ్యాట్) అనేది దేశవ్యాప్తంగా మేనేజిమెంట్‌ కాలేజీల్లో ప్రవేశం కోసం నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష.

సీమ్యాట్‌ పరీక్ష ఫీజు దాఖలుకు చివరి తేదీగా 2021 జనవరి 23 ను నిర్ణయించింది. అభ్యర్థులు దరఖాస్తులు, పరీక్ష ఫీజులను నిర్ణీత తేదీలకు ముందు సమర్పించాలి. 2021 ఫిబ్రవరి 22 నుంచి 27 వరకు ఎన్‌టీఏ కంప్యూటర్ ఆధారిత సీమ్యాట్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. పరీక్ష రెండు షిఫ్టులలో నిర్వహించనున్నారు. మొదటి షిఫ్ట్ పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు జరుగుతుంది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.