గురువారం 28 మే 2020
National - May 22, 2020 , 12:37:34

ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ఆదుకుంటున్నాం: సీఎం జగన్‌

ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ఆదుకుంటున్నాం: సీఎం జగన్‌

అమరావతి:  రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కరోనా ప్రభావం ఉన్నా..చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకోవాలని నిర్ణయించామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు 6 నెలల మారిటోరియం ఉంటుందన్నారు. ఆ తర్వాత చెల్లించేలా పరిశ్రమలకు భరోసా కల్పిస్తామని చెప్పారు. 

'జేసీ పర్యవేక్షణలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు భరోసా ఉంటుంది. పరిశ్రమల నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆదుకోవాలి. పరిశ్రమలకు ఎలాంటి నైపుణ్యంగల కార్మికులు అవసరమో గుర్తించాలి. 75శాతం స్థానిక రిజర్వేషన్లు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలి.   6 నుంచి 8శాతం వడ్డీకే రుణాలు కల్పించేందుకు నిర్ణయించాం. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యతను సాధించేందుకు 25 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలను కూడా ఏర్పాటు చేస్తున్నామని' సీఎం పేర్కొన్నారు.  logo