గురువారం 04 జూన్ 2020
National - Apr 01, 2020 , 18:02:52

ఇలాంటి పరిస్థితుల్లో మీ సహకారం మరిచిపోలేనిది

ఇలాంటి పరిస్థితుల్లో మీ సహకారం మరిచిపోలేనిది

అమరావతి: 'కరోనా ప్రభావంతో రాష్ట్ర ఆదాయం మొత్తం దెబ్బతిన్నది.  కరోనా నియంత్రణ చర్యల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై భారం పడిందని' ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. కరోనా కట్టడి, లాక్‌డౌన్‌ తదితర అంశాలపై  జగన్‌  మీడియా సమావేశంలో మాట్లాడారు. 

'ప్రజాప్రతినిధులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతో పాటు ఇతర అధికారులు, పెన్షనర్లకు కృతజ్ఞతలు. ఇలాంటి పరిస్థితుల్లో మీ సహకారం మరిచిపోలేనిది. రైతులు, రైతు కూలీలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు వ్యవసాయ పనులకు వెళ్లొచ్చు.  వ్యవసాయ పనులకు ఎలాంటి ఇబ్బంది లేదు. సామాజిక దూరం పాటిస్తూ పనులు చేసుకోవచ్చు. వైరస్‌ సోకితే..ఏదో జరిగిపోతుందనే అపోహ వద్దు. వయసు మళ్లిన వారు కొంత జాగ్రత్తగా ఉండాలి.  కరోనా చికిత్స అందించడంలో సమగ్ర విధానం పాటిస్తున్నాం. కరోనాపై పోరాటానికి అన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు  సిద్ధంగా ఉండాలి.  ఇలాంటి పరిస్థితుల్లో సహకరించాలి. 'అని జగన్‌ విజ్ఞప్తి చేశారు.


logo