బుధవారం 03 జూన్ 2020
National - May 07, 2020 , 13:25:00

విశాఖకు చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌

విశాఖకు చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌

అమరావతి : ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్‌లో విశాఖపట్నం చేరుకున్నారు. కాసేపట్లో కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రికి చేరుకోనున్నారు. గ్యాస్‌ లీక్‌ ప్రమాదంలో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు. విశాఖ కేజీహెచ్‌లో 187 మంది, అపోలో ఆస్పత్రిలో 48 మంది, సెవెన్‌హిల్స్‌ ఆస్పత్రిలో 12 మంది చికిత్స పొందుతున్నారు. సీరియస్‌గా ఉన్నవారిని జీజీహెచ్‌కు తరలిస్తున్నారు.

బాధ్యులను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టం.. 

అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిన గ్యాస్‌ లీక్‌ కారకులు ఎంతటి వారైనా సరే కఠిన శిక్షను ఎదుర్కొక తప్పదని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఈ దుర్ఘటనకు బాధ్యులైన వారిని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టదని ఆయన పేర్కొన్నారు. logo