మంగళవారం 31 మార్చి 2020
National - Mar 15, 2020 , 13:48:22

ఎన్నికల కమిషనర్‌ వైఖరిపై జగన్‌ అసంతృప్తి!

ఎన్నికల కమిషనర్‌ వైఖరిపై జగన్‌ అసంతృప్తి!

అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ ముగిసింది.  ఆదివారం ఉదయం   తాడేపల్లి  సీఎం క్యాంపు కార్యాలయంలో కరోనా వైరస్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ తర్వాత నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ విశ్వ భూషణ్‌తో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాయిదా, కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై  గవర్నర్‌తో చర్చించారు.

సుమారు గంటకు పైగా గవర్నర్‌తో జగన్‌ భేటీ జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ తీరుపై గవర్నర్‌కు జగన్‌ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఎన్నికలు వాయిదా పడటంతో స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోనున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను 6 వారాల పాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే. 


logo
>>>>>>