శనివారం 30 మే 2020
National - May 12, 2020 , 15:12:24

కరోనా బాధితుల పట్ల వివక్ష చూపడం సరికాదు: సీఎం జగన్‌

కరోనా బాధితుల పట్ల వివక్ష చూపడం సరికాదు: సీఎం జగన్‌

తాడేపల్లి: కరోనా నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తదితరులు హాజరయ్యారు.   కరోనా పట్ల ప్రజల్లో భయాందోళనలను తొలగించాల్సిన అవసరముందని, దీనికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు. వైరస్‌ సోకినవారి పట్ల వివక్ష చూపడం సరికాదన్నారు. కరోనా వైరస్‌ పట్ల అవగాహన పెంచుకోవడంతో పాటు కరోనా  చికిత్స చేయించుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని ముఖ్యమంత్రి కోరారు. ధాన్యం సేకరణను ముమ్మరం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. 


logo