బుధవారం 03 జూన్ 2020
National - May 09, 2020 , 14:59:19

కోయంబేడు మార్కెట్‌ నుంచి వచ్చినవారిపై ప్రత్యేక దృష్టి: సీఎం జగన్‌

కోయంబేడు మార్కెట్‌ నుంచి వచ్చినవారిపై ప్రత్యేక దృష్టి: సీఎం జగన్‌

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 1,65,059 కరోనా పరీక్షలు చేసినట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు.  నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 8,388 మందికి పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. కరోనా నివారణ చర్యలపై  సీఎం జగన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు. 

'కొత్తగా నమోదవుతున్న కేసుల కన్నా..డిశ్చార్జిలు పెరుగుతున్నాయి. చెన్నై కోయంబేడు మార్కెట్‌ నుంచి వచ్చినవారిపై దృష్టి పెట్టాం. కరోనా మరణాలు లేకుండా మంచి వైద్యం అందించడంపై దృష్టిపెట్టాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారే ఎక్కువగా మరణిస్తున్నారు. 700 మంది కూలీలు అనుమతి లేకుండా ఏపీలోకి ప్రవేశించారని' జగన్‌ పేర్కొన్నారు. 


logo