ఆదివారం 05 జూలై 2020
National - Jun 23, 2020 , 11:49:03

శ్యాం ప్రసాద్‌ ముఖర్జికి సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నివాళి

శ్యాం ప్రసాద్‌ ముఖర్జికి సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నివాళి

లక్నో : భారతీయ జన సంఘ్‌ ఫౌండర్‌ శ్యాం ప్రసాద్‌ ముఖర్జి మరణ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం లక్నోలోని సివిల్‌ దవాఖానలోని ఆయన విగ్రహానికి ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం దవాఖాన మొత్తం తిరిగి రికార్డులు పరిశీలించి, రోగులతో మాట్లాడి సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. అంతకు ముందు ప్రధాని నరేంద్రమోడి, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, బీజేపీ జాతియ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ సీనియర్‌ నేతలు, తదితరులు శ్యాం ప్రసాద్‌ ముఖర్జీకి నివాళులర్పించారు. 


శ్యాం ప్రసాద్‌ ముఖర్జి (1901-1953) సీనియర్‌ రాజకీయ నాయకుడు, బారిస్టర్‌, విద్యావేత్త.  ఆయన భారతీయ జన సంఘ్‌కు ఫౌండర్‌గా ఉన్నారు. ఈయన జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర పరిశ్రమలు, సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. అయినప్పటికీ నెహ్రూతో విభిన్న అభిప్రాయాల నేపథ్యంలో ఆయన జనతా పార్టీని స్థాపించారు. అదే బీజేపీగా మారింది. logo