శుక్రవారం 05 జూన్ 2020
National - May 11, 2020 , 16:23:26

కోవిడ్‌-19 ప‌రీక్ష‌ల కోసం ప్ర‌త్యేక బ‌స్సులు..

కోవిడ్‌-19 ప‌రీక్ష‌ల కోసం ప్ర‌త్యేక బ‌స్సులు..


క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం కోవిడ్‌-19 ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు వీలుగా బ‌స్సుల్లో ప్ర‌త్యేక మార్పులు చేసింది. బ‌స్సులో డాక్ట‌ర్ రోగిని చూసేందుకు వీలుగా టేబుల్, కుర్చీతోపాటు ప‌రీక్ష కోసం క్యాబిన్ ను ఏర్పాటు చేశారు. బెంగళూరులో ప్ర‌త్యేక సౌక‌ర్యాలతో ఉన్న 4 బ‌స్సుల‌ను క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి బీఎస్ య‌డియూర‌ప్ప ప్రారంభించారు.

క‌‌ర్ణాట‌క‌లో ఇవాళ కొత్త‌గా 10 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం పాజిటివ్ కేసులు 858కు చేరుకున్నాయి.