శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 21, 2020 , 18:03:27

మోదీతో ఉద్ధవ్‌ ఠాక్రే భేటీ

మోదీతో ఉద్ధవ్‌ ఠాక్రే భేటీ

న్యూఢిల్లీ:   శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఇవాళ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.  ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానితో ఉద్ధవ్‌ సమావేశం కావడం ఇదే తొలిసారి.  ఉద్ధవ్‌ తనయుడు, మంత్రి ఆదిత్య ఠాక్రే కూడా మోదీని కలిశారు. వీరిద్దరి మధ్య ఏఏ అంశాలు చర్చకు వస్తాయనే విషయాన్ని పార్టీ వెల్లడించకపోయినప్పటికీ మర్యాదపూర్వక భేటీ అని శివసేన చెబుతోంది.  రాష్ట్రంలో ఎన్‌పీఆర్‌ను అమలు చేస్తామని ఉద్ధవ్‌ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. 


logo