గురువారం 09 జూలై 2020
National - Jun 19, 2020 , 18:58:36

ఆర్మీ సైనికుడు నాయక్‌ దీపక్‌కుమార్‌కు శివరాజ్‌ సింగ్‌ నివాళి

ఆర్మీ సైనికుడు నాయక్‌ దీపక్‌కుమార్‌కు శివరాజ్‌ సింగ్‌ నివాళి

రేవా : భారత్‌, చైనా ఘర్షణలో మృతిచెందిన ఆర్మీ సైనికుడు నాయక్‌ దీపక్‌కుమార్‌ అంత్యక్రియలు శుక్రవారం మధ్యప్రదేశ్‌లోని రేవాలో జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శివారాజ్‌ సింగ్‌ చౌహాన్‌ దీపక్‌ మృతదేహాన్నిసందర్శించి అతడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం దీపక్‌ శవపేటికను మోసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఘర్షణలో రాష్ట్ర సైనికుడు దీపక్‌కుమార్‌ మృతి కలచివేసింది. ఆయన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం అని అన్నారు. దీపక్‌ అంతిమయాత్రకు  ఆర్మీ అధికారులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. దేశం కోసం ప్రాణాలొదిలిన సైనికుడు దీపక్‌ అంటూ నినాదాలు చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. 
logo