మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Nov 10, 2020 , 13:01:25

భోపాల్ పార్టీ ఆఫీస్‌లో సీఎం శివ‌రాజ్‌సింగ్‌‌, బీజేపీ సీనియ‌ర్ నేత‌ల సెల‌బ్రేష‌న్స్‌

భోపాల్ పార్టీ ఆఫీస్‌లో సీఎం శివ‌రాజ్‌సింగ్‌‌, బీజేపీ సీనియ‌ర్ నేత‌ల సెల‌బ్రేష‌న్స్‌

భోపాల్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఉపఎన్నిక‌ల్లో అధికార బీజేపీ స‌త్తా చాటుతున్న‌ది. మొత్తం 28 స్థానాల‌కు ఉపఎన్నిక‌లు జ‌రుగ‌గా 19 స్థానాల్లో బీజేపీ ముందంజ‌లో కొనసాగుతున్న‌ది. కాంగ్రెస్ 8 స్థానాల్లో, బీఎస్పీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. దీంతో బీజేపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు సంబురాలు చేసుకుంటున్నారు. భోపాల్‌లోని పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి శివ‌రాజ్‌సింగ్‌, సీనియ‌ర్ నేత‌లు ఒక‌రికొక‌రు స్వీట్లు తినిపించ‌కుని శుభాకాంక్ష‌లు చెప్పుకున్నారు. 

మొత్తం 230 అసెంబ్లీ స్థానాలున్న మ‌ధ్య‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ప్ర‌స్తుతం బీజేపీకి 107 మంది స‌భ్యుల బ‌లం ఉన్న‌ది. కాంగ్రెస్ పార్టీకి 87 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ స‌ర్కారు అధికారంలో కొన‌సాగాలంటే బీజేపీ క‌చ్చితంగా 8 స్థానాల్లో గెలువాల్సి ఉంది. కానీ, బీజేపీ ప్ర‌స్తుతం 19 స్థానాల్లో ముందంజ‌లో ఉండ‌టంతో త‌మ ప్ర‌భుత్వానికి ఎలాంటి ఢోకా లేద‌ని భావిస్తున్న బీజేపీ నేత‌లు సంబురాలు జ‌రుపుకుంటున్నారు. 

 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.