శనివారం 30 మే 2020
National - May 15, 2020 , 19:13:22

వ‌ల‌స కార్మికుల‌కు రేష‌న్ కిట్స్ పంపిణీకి ఏర్పాట్లు

వ‌ల‌స కార్మికుల‌కు రేష‌న్ కిట్స్ పంపిణీకి ఏర్పాట్లు

ఉత్త‌రాఖండ్‌: లాక్ డౌన్ తో ఇత‌ర‌ రాష్ట్రాల్లో చిక్కుకున్న కార్మికులు ప్ర‌త్యేక రైళ్లలో స్వ‌స్థ‌లాల‌కు చేరుకుంటున్నారు.  ఈ నేప‌థ్యంలో వ‌ల‌స కార్మికుల‌కు రేష‌న్ కిట్స్ పంపిణీ చేసేందుకు ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉత్త‌రాఖండ్ కు చేరుకున్న వ‌లస కార్మికులకు రేష‌న్ కిట్స్ అందించేలా ఏర్పాట్లు చేయాల‌ని సీఎం త్రివేంద్ర సింగ్ రావ‌త్ సంబంధిత అధికారుల‌కు ఆదేశాలు జారీచేశారు.

వ‌ల‌స‌కార్మికులు, కూలీల‌తోపాటు నిత్య‌వ‌స‌రాలు అవ‌స‌ర‌మైన వారంద‌రికీ రేష‌న్ స‌రుకులు అంద‌జేయాల‌ని అధికారులకు సీఎం నిర్దేశించారు. కేంద్రం సూచ‌న‌ల మేర‌కు ఉత్త‌రాఖండ్‌లో మూడో ద‌శ లాక్ డౌన్ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. కంటైన్ మెంట్ జోన్లు మిన‌హా కొన్ని ప్రాంతాల్లో ప్ర‌భుత్వం కొన్ని స‌డ‌లింపులు ఇచ్చింది. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo