శుక్రవారం 03 జూలై 2020
National - Jun 29, 2020 , 11:33:16

ఢిల్లీలో వైద్యుడికి సీఎం నివాళి

ఢిల్లీలో వైద్యుడికి సీఎం నివాళి

న్యూ ఢిల్లీ : కరోనా వ్యాధితో  ఆదివారం చనిపోయిన ఎల్‌ఎన్‌జేపీ సీనియర్‌ వైద్యుడు ఆసీం గుప్తాకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ సోమవారం నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా ఆయన ‘‘ డాక్టర్‌ ఆసిన్‌ గుప్తా ఎల్‌ఎన్‌జేపీ సీనియర్‌ వైద్యుడు. ఆయన ఆదివారం కరోనా వ్యాధికి లోనై మృతి చెందారు. అతను రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో ప్రసిద్ధి చెందినవాడు. మనం ఒక విలువైన పోరాట యోధుడిని కోల్పోయాం. నేను అతడి కుటుంబ సభ్యులు, భార్యతో మాట్లాడాను. వారిని ఓదార్చి మీకు ఎల్లవేళలా మద్దతుగా ఉంటానని హామీ ఇచ్చాను’ అని సీఎం కేజ్రివాల్‌ ట్వీట్‌ చేశారు. logo