ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 13:57:50

సీఎం నితీశ్ కనిపించడం లేదు...

సీఎం నితీశ్ కనిపించడం లేదు...

పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ కనిపించడం లేదని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విమర్శించారు. ఒకవైపు కరోనా, మరోవైపు వరదలతో రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆయన అన్నారు. లా అండ్ ఆర్డర్ కూడా అదుపులో లేదన్నారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులుండగా సీఎం నితీశ్ కుమార్ మాయమయ్యారంటూ తేజస్వీ యాదవ్ ఆరోపించారు. బుధవారం దర్భాంగా ప్రాంతాన్ని సందర్శించిన ఆయన వరద బాధితులకు ఆహారాన్ని పంపిణీ చేశారు. అనంతరం మధోపూర్ ప్రాంతాన్ని సందర్శిస్తానని తేజస్వీ చెప్పారు. బీహార్ అసెంబ్లీకి అక్టోబర్ నెలలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ మద్దతుతో అధికారంలో ఉన్న జేడీఎస్ సీఎం నితీశ్ కుమార్‌పై ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ మండిపడుతున్నది.logo