శుక్రవారం 27 నవంబర్ 2020
National - Oct 28, 2020 , 11:16:36

జ‌న‌ర‌ల్ డ‌య్య‌ర్‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నారు..

జ‌న‌ర‌ల్ డ‌య్య‌ర్‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నారు..

హైద‌రాబాద్‌:  బిహార్ రాష్ట్రంలోని ముంగేర్ పట్టణంలో దుర్గా మాత విగ్రహాల నిమజ్జనంలో సోమవారం ఘర్షణ చోటుచేసుకున్నది. ఆ రోజున అర్ధరాత్రి పోలీసులు-నిమజ్జనకారుల మధ్య జరిగిన ఘర్షణ కారణంగా పోలీసులు కాల్పులు జరుపడంతో ఒకరు మృతిచెందగా.. 20 మంది పోలీసులతోపాటు 27 మంది గాయపడ్డారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల ఆర్జేడీ నేత తేజ‌స్వి యాద‌వ్‌, ఎల్‌జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ స్పందించారు.  ముంగేర్ ఘ‌ట‌న ప‌ట్ల హైకోర్టు నేతృత్వంలోని క‌మిటీ ద‌ర్యాప్తు చేప‌ట్టాలని తేజ‌స్వి యాద‌వ్ డిమాండ్ చేశారు. నిందితుల ప‌ట్ల క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.  జిల్లా మెజిస్ట్రేట్‌, ఎస్పీ   లిపి సింగ్‌ను త‌క్ష‌ణ‌మే బ‌దిలీ చేయాల‌ని డిమాండ్ చేశారు.  జ‌న‌ర‌ల్ డ‌య్య‌ర్‌లా వ్య‌వ‌హ‌రించే విధంగా ఎవ‌రు ఆదేశాలు ఇచ్చార‌ని తేజ‌స్వి ప్ర‌శ్నించారు. ముంగేర్ ఘ‌ట‌న ప‌ట్ల లోక్‌జ‌న‌శ‌క్తి పార్టీ చిరాగ్ పాశ్వాన్ కూడా రియాక్ట్ అయ్యారు.   ముంగేర్‌లో ఫైరింగ్‌, లాఠీచార్జ్‌కు ఎవ‌రు బాధ్య‌లు అంటూ చిరాగ్ ప్ర‌శ్నించారు.  జ‌లియ‌న్ వాలాబాగ్ దాడికి ఆదేశాలు ఇచ్చిన జ‌న‌ర‌ల్ డ‌య్య‌ర్‌లా సీఎం నితీశ్ వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ పాశ్వాన్ ఆరోపించారు. ఈ ఘ‌ట‌న‌కు సీఎం బాధ్య‌త వ‌హించాల‌ని, దీనిపై ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌న్నారు.