ఆదివారం 07 జూన్ 2020
National - Apr 04, 2020 , 10:34:57

మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారికి ఒడిశా సీఎం విజ్ఞప్తి

మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారికి ఒడిశా సీఎం విజ్ఞప్తి

భువనేశ్వర్‌ : ఢిల్లీ మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిందిగా ఒడిశా రాష్ట్ర సీఎం నవీన్‌ పట్నాయక్‌ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని తబ్లిగీ జమాతేకు హాజరైన వారు స్వచ్ఛందంగా 104 హెల్ఫ్‌లైన్‌కు కాల్‌ చేసి సమాచారం తెలపాల్సిందిగా కోరారు. దేనిగురించి భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం వారికి అన్ని విధాల అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఒడిశా రాష్ట్రవ్యాప్తంగా ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో నిర్వహించిన తబ్లిగీ జమాతే ఈవెంట్‌కు హాజరైనట్లుగా సమాచారం. వీరందరి ఆచూకీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo