శనివారం 06 జూన్ 2020
National - May 22, 2020 , 12:32:58

రాష్ట్రపతి కోవింద్‌కు కృతజ్ఞతలు: సీఎం మమతాబెనర్జీ

రాష్ట్రపతి కోవింద్‌కు కృతజ్ఞతలు: సీఎం మమతాబెనర్జీ

కోల్‌కతా: అంఫాన్‌ తుఫాను ధాటికి తీవ్రంగా నష్టపోయిన పశ్చిమబెంగాల్‌కు మద్దతుగా నిలుస్తోన్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీ కృతజ్ఞతలు తెలియజేశారు. అంఫాన్‌ విలయ తాండవం సృష్టించిన నేపథ్యంలో తనకు ఫోన్‌ చేసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నందుకు రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు. 

విపత్కర పరిస్థితుల్లో పశ్చిమబెంగాల్‌ ప్రజలకు అండగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అంఫాన్‌ తుఫాను ప్రభావానికి పశ్చిమబెంగాల్‌లో ఇప్పటివరకు 80 మంది మృతి చెందారు. ఒడిశాలో ఇద్దరు మృతి చెందారు. అంఫాన్‌ వల్ల తీవ్రంగా నష్టపోయిన బెంగాల్‌కు యావత్ జాతి అండగా ఉంటుందని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారు. అంఫాన్‌ ప్రభావ పరిస్థితులను అంచనా వేసేందుకు   ప్రధాని మోదీ పశ్చిమబెంగాల్‌లో పర్యటిస్తున్నారు.  ప్రధాని ఏరియల్‌ సర్వే నిర్వహించి పరిస్థితులపై సీఎం మమతాబెనర్జీతో సమీక్షించనున్నారు. మరోవైపు ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో కూడా సమావేశం కానున్నట్లు సమాచారం. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo