శనివారం 06 జూన్ 2020
National - May 22, 2020 , 12:57:15

'ప్రైవేట్‌ రంగంలో ఎక్కువ ఉపాధి ఇచ్చేది ఎంఎస్‌ఎంఈలే'

'ప్రైవేట్‌ రంగంలో ఎక్కువ ఉపాధి ఇచ్చేది ఎంఎస్‌ఎంఈలే'

అమరావతి: పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యం కలిగిన వారిని తయారు చేస్తే ఉపాధి పెరుగుతుందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఒక్కొక్కటి చొప్పున నైపుణ్యాభివృద్ధి కళాశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. చిన్న పరిశ్రమల నుంచి పెద్ద పరిశ్రమల వరకు ఎలాంటి నైపుణ్యం కావాలో జాబితా తయారు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాల విడుదల కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 

'ప్రైవేట్‌ రంగంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది ఎంఎస్‌ఎంఈలే. ఎంఎస్‌ఎంఈలను కాపాడుకోకపోతే నిరుద్యోగం పెరుగుతుంది. ఎంఎస్‌ఎంఈలపై కలెక్టర్లంతా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కచ్చితంగా ఎంఎస్‌ఎంఈల సమస్యలు పరిష్కరించాలి. లాక్‌డౌన్‌ సమయంలో ఈ రంగం పూర్తిగా  కుదేలైంది. మా సమస్యల కన్నా మీ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే మీకు అండగా నిలుస్తున్నామని' సీఎం పేర్కొన్నారు. 


logo